కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరం చేయండి: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీలోకి చేరికలు ముమ్మరం చేయాలని పార్టీ నాయకులను నీటి పారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.హైదరాబాద్ సచివాలయంలో రెండు నియోజకవర్గాల పీసీసీ సభ్యులు,బ్లాక్,మండల, పట్టణ అధ్యక్షులు,ఎంపీపీ లు,జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించి, జరుగుతున్న అభివృద్ది పనులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారితో సమీక్ష చేశారు.రూ.6 కోట్ల 24 లక్షలతో హుజూర్ నగర్,కోదాడ ఏరియా ఆసుపత్రుల్లో సిటీ స్కానింగ్ మిషన్లు, హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో నూతన వైద్య పరికరాలకు రూ.25లక్షలు,హుజూర్ నగర్ లో 37 కోట్లతో ఐటిఐ కళాశాల మంజూరు చేసినట్లు,నిర్మాణం కోసం 5 నుండి 10 ఎకరాల స్థలం అవసరమని,రెవెన్యూ అధికారులు అనువైన స్థలం కోసం పరిశీలిస్తున్నారని,ఆ ప్రక్రియ పూర్తి కాగానే నిర్మాణ పనులు చేపడతామన్నారు.

 Increase Inclusions In Congress Party Minister Uttam, Congress Party , Minister-TeluguStop.com

హుజూర్ నగర్,కోదాడలో రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరుకు కృషి చేస్తున్నామని,ఇందుకు ఒక్కో స్కూల్ నిర్మాణానికి 20 ఎకరాల స్థలం అవసరమన్నారు.

హుజూర్ నగర్,కోదాడలో కొత్తగా ఏర్పాటైన మండలాలకు స్వంత పరిపాలన భవనాలను మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు.రెడ్లకుంట వద్ద చెక్ డ్యాం నిర్మాణ ప్రతిపాదనలు చేసినట్లు వివరిచారు.హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల్లో ఈ వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ఎస్డిఎఫ్, డిఎంఎఫ్టి15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.అదే విధంగా ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, డిఎంఎఫ్టి,ఈజీఎస్,ఎస్ డి ఎఫ్ నిధులతో మంజూరైన రోడ్లు,డ్రైన్లు,బ్రిడ్జిలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులను తక్షణమే పూర్తి చేయాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అవసరం ఉన్న చోట్ల చెక్ డ్యాంలు నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిపారు.పులిచింతల బ్యాక్ వాటర్ తగ్గితే అందుకు అనుగుణంగా పైప్ లైన్లు లోపలికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో సాగు,త్రాగు నీటిని వినియోగంలోకి తేవాలన్నారు.మోతె మండలానికి పూర్తి స్థాయిలో సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

స్థానిక నాయకులు విజ్ఞప్తి మేరకు హుజూర్ నగర్ లో ఎంపీపీ కార్యాలయం ముందు బిఓటి పద్ధతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు.మోతె, నడిగూడెం,మునగాలకు ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని,అనంతగిరి హై స్కూల్ శిథిలావస్థకు చేరిందని,కొత్త భవనం నిర్మించాలని,హుజూర్ నగర్ పోలీస్ సర్కిల్ కార్యాలయం శిధిలావస్థకు చేరిందని మరమత్తులు చేపట్టాలని స్థానిక నాయకులను మంత్రి కోరారు.

రాష్ట్ర కాంగ్రెస్ పాలసీ ప్రకారం ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ముమ్మరం చేయాలని, చేరికలను స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వ్యతిరేకించవద్దని హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గాల బ్లాక్, మండల,టౌన్ అధ్యక్షులకు సూచించారు.పార్టీ పదవులలో నామినేటెడ్ పదవులలో స్థానిక సంస్థల ఎన్నిక పదవులలో పార్టీలో మొదటి నుండి ఉండి కష్టపడి పనిచేసిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.

స్థానిక నాయకులు పైరవీలు కాకుండా స్థానికంగా ఉన్న మౌలిక సమస్యలు నా దృష్టికి తీసుకురావాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube