ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

నల్లగొండ జిల్లా: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు.నల్లగొండ,సూర్యాపేట,భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ,మున్సిపల్, మండల కేంద్రాల్లో రోడ్లపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

 Agitations Across The Joint District In Protest Against The Arrest Of Mlc Kavith-TeluguStop.com

మోడీ…కేడీ… అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లడుతూ వెయ్యి మంది మోడీలు, రేవంత్‌లు వచ్చినా భయపడేది లేదన్నారు.

ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ అణిచివేత ధోరణిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube