ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

నల్లగొండ జిల్లా: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు.

నల్లగొండ,సూర్యాపేట,భువనగిరి జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ,మున్సిపల్, మండల కేంద్రాల్లో రోడ్లపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

మోడీ.కేడీ.

అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లడుతూ వెయ్యి మంది మోడీలు, రేవంత్‌లు వచ్చినా భయపడేది లేదన్నారు.

ఎలాంటి మచ్చలేకుండా ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ అణిచివేత ధోరణిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

ఫిలింఫేర్ అవార్డులలో సత్తా చాటిన సాయి పల్లవి… స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి మరీ?