అందరూ ఆ రోజు కోసమే వెయిటింగ్...!

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి అన్ని విధాలా కలిసొచ్చే బలమైన మంచి ముహూర్తం కోసం వెయిటింగ్ చేస్తున్నారు.నామినేషన్ల ఘట్టం ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా కేవలం స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ఇప్పటి వరకూ నామినేషన్లు దాఖలు చేశారు.

 Political Parties Mla Candidates Waiting For That Date For Nominations, Politica-TeluguStop.com

నామినేషన్ల గడువు ఈ నెల10 వరకు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా 9వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:16 గంటల వరకు,10వ తేదీ ఉదయం 9:16 గంటల నుండి మధ్యాహ్నం 2:51 గంటల వరకు శుభ గడియలు ఉన్నాయని పండితులు చెప్పడంతో ఆ రెండు రోజుల్లో నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నెల 9వ తేదీ గురువారం ఏకాదశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం కావడంతో చాలా ప్రత్యేకమైన రోజుగా భావించి,ఆ రోజు ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుందని బలంగా నమ్ముతూ ఎక్కువ మంది అభ్యర్థులు 9వ తేదీనే నామినేషన్లు వేసేందుకు సర్వం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

ఇదే రోజున సీఎం కేసీఅర్ కూడా నామినేషన్ వేస్తున్నట్లున్ ప్రచారం జరగడంతో అందరూ దానికోసమే వెయిటింగ్ చేస్తున్నట్లు ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇది ఇలా ఉంటే కొందరి అభ్యర్థుల లక్కి నెంబర్ 09 కావడం, జాతక బలం 09 ఉండడం కూడా ఆ రోజు నామినేషన్ వేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.

దీనితో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నామినేషన్ల ప్రక్రియ 9న ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు అధిక సంఖ్యలో దాఖలవుతాయని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube