త్వరలో 100 కోట్ల విమానం లెక్కలు విప్పుతా

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ జారీ కావచ్చని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.ఆదివారం మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్ గోపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన ప్రజలు నిండు హృదయంతో ఆశీర్వాదిస్తున్నారని అన్నారు.

 100 Crore Plane Will Be Revealed Soon-TeluguStop.com

ఎందుకంటే అతను మా కోసమే రాజీనామా చేసాడని ప్రజలకు ఎప్పుడో అర్ధమైందన్నారు.రాజగోపాల్ రెడ్డి సవాళ్లకు సమాధానాలు చెప్పే దమ్ము టీఆర్ఎస్ కి లేదన్నారు.మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేశారని,హుజూరాబాద్ లో నన్ను గెలవకుండా ఎన్ని పథకాలు పెట్టారో,నేడు మునుగోడులో కూడా అదే అస్త్రాన్ని కేసీఆర్ వాడుతున్నారని తెలిపారు.57 ఏండ్లు నిండిన వాళ్ళకి పింఛన్ లు ఇస్తామని,మూడున్నర ఏండ్లుగా మొండి చేయి చూయించాడని,ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వల్లే పదిలక్షల పింఛన్లు అమలు చేస్తున్నారని, గిరిజనులకి 10% రిజర్వేషన్ లు ఇస్తామని 8 ఏళ్ల నుండి చెప్పుకొచ్చి నేడు మునుగోడులో గిరిజనుల ఓట్ల కోసమే రిజర్వేషన్లు ప్రకటించాడని గుర్తుచేశారు.దళిత వాడల్లో టీఆర్ఎస్ నేతలు తిష్టవేసి మీరందరు టీఆర్ఎస్ కి ఓట్లు వేస్తేనే మీకు దళిత బంధు వస్తుందని భయాందోళనకు గురించేస్తున్నారని ఆరోపించారు.మునుగోడులో ఉన్న ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళిత బంధు వెంటనే అమలు చేయాలని ఈటెల డిమాండ్ చేశారు.

గిరిజనులకు కూడా వెంటనే పైలట్ ప్రాజెక్ట్ కింద గిరిజన బంధు ప్రకటించాలన్నారు.అర్హులైన నిరుపేద కుటుంబాలకి పేద బంధు కూడా అమలు చేయాలన్నారు.పోడు వ్యవసాయం చేసే గిరిజనులని అడ్డుకొని మహిళలు, చిన్న పిల్లలనే కనికరం లేకుండా సంకెళ్లు వేసిన సంఘటనలు కూడా మనం టీఆర్ఎస్ పాలనలో చూశామని,ఖమ్మం,ఆదిలాబాద్,వరంగల్ అడవుల్లో కూర్చొని గిరిజనుల భూములని క్రమబద్దికరణ చేస్తామని కెసిఆర్ అసెంబ్లీలో హామీలిచ్చారన్నారు.హుజురాబాద్,దుబ్బాక ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని ప్రచారం చేశారని,అక్కడి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా మళ్ళీ అదే పాట మునుగోడులో కూడా పాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

మునుగోడు నియోజకవర్గం ప్రజలందరికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మీకు ఈ రోజు ఏ అభివృద్ధి పథకం వచ్చినా అది అంత రాజ్ గోపాల్ రెడ్డి ద్వారా మాత్రమే,కాబట్టి ప్రజలంతా బీజేపీని గెలుపించుకొని ఆత్మగౌరవన్ని నిలబెట్టాలన్నారు.కులాల వారీగా ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,గొల్ల కురుమల పెద్ద ఎత్తున మునుగోడులో ఉన్నాయని,వాళ్ళ కుటుంబాలకి ఆంక్షలు లేకుండా లక్ష డెబ్భై అయిదు వేలు వేయాలి,నేతన్నల బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి,సర్పంచ్,ఎంపిటీసీ,జడ్పీటీసీలకు ఎన్నడన్నా నిధులు వచ్చిన పాపానపోలేదు,నేడు ఎక్కడ ఉప ఎన్నిక ఉన్న వాళ్ళకి పెండింగ్ లో ఉన్న బిల్లులని వెంటనే రిలీజ్ చేస్తున్నారు.

అనేకమంది ప్రజా ప్రతినిధులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు.గ్రామాలకు 14వ,15వ,ఫైనాన్స్ కమిషన్ నుండి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నేడు గ్రామలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 850 కోట్లు పార్టీ ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయని,నేడు 100కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని ఎలా కొన్నారో, ఒక్కో ఎమ్మెల్యే పార్టీకి ఎన్ని కొట్లు ఫండ్స్ ఇచ్చారో, ఎలా ఇచ్చారో ప్రజలకి త్వరలోనే చెప్తా అన్నారు.నేడు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి ప్రజలను కేసీఆర్ చంపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube