యాదాద్రి జిల్లా:రక్తహీనత,పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలి మహిళా సంక్షేమ,వైద్య శాఖ అధికారుల సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో మహిళా శిశు, దివ్యాంగుల,వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా స్థాయిలో బ్లాక్ రిసోర్స్ గ్రూప్ (BRG) శిక్షణ కార్యక్రమాన్ని పోషణ పక్వాడా కార్యక్రమంపై ఐ.సి.డి.ఎస్.సి.డి.పి.ఓ.సూపర్వైజర్స్,మెడికల్ ఆఫీసర్స్,హెల్త్ సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ,మహిళా శిశు సంక్షేమ శాఖ,వైద్యశాఖ సమన్వయంతో జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పని చేసి రక్తహీనత నివారణ,పోషణ లోపం నివారణపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.100 శాతం ఫలితాలు సాధించాలని,రక్తహీనత లేని పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.శిక్షణా కార్యక్రమంలో స్త్రీలలో రక్తహీనతను నివారించడం,శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడాన్ని నిర్ధారించుకోవడం,అదనపు ఆహారం అంశాలపై ప్రతి అంగన్వాడి పరిధిలో తల్లులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి,అదనపు ఆహారం అంటే ఏమిటి,ఎందుకు ఇవ్వాలి,ఇవ్వకుంటే జరిగే నష్టాలు,అదనపు ఆహారం ఇవ్వటం వలన పిల్లల వయసుతో పాటు ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలు తల్లులకు ఏవిధంగా అవగాహన కల్పించాలి,అదేవిధంగా స్త్రీలలో రక్తహీనతను నివారించటం గురించి,స్త్రీలలో రక్తహీనత వలన తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం,రక్తహీనత వలన ప్రసవం సమయంలో తల్లికి కూడా ప్రమాదం ఏర్పడే అవకాశాల గురించి,దీనిని నివారించటం కోసం తల్లులు ఎలాంటి ఆహార పదార్థాలు తమ దైనందిన జీవితంలో తీసుకోవడం వలన రక్తహీనతను నివారించవచ్చునో తెలియజేయడం జరిగిందన్నారు.
రక్తహీనత నివారణకు సమన్వయంతో ఏ విధంగా నివారించుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడాన్ని నిర్ధారించుకుని తల్లులకు అందరూ ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇచ్చినట్లు అయితే చిన్నపిల్లల్లో వచ్చే డయేరియా,ఇతర అంటువ్యాధులను ఎలా నివారించవచ్చునో,తల్లిపాల వలన ఉపయోగాలు గురించి అవగాహన పొంది తిరిగి బ్లాక్ స్థాయిలో ఆశాలకు,అంగన్వాడి టీచర్లకు ఇవ్వాలని తెలియచెప్పడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి కృష్ణవేణి,జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు,వైద్య అధికారులు పాల్గొన్నారు.