రోడ్డు ఎక్కిన విద్యార్థులు

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మండలం తాటికల్లు గ్రామంలో సోమవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బడికి బంద్ పెట్టి రోడ్డెక్కారు.పాఠశాల ముందు జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.

 Students On The Road-TeluguStop.com

వీరికి మద్దతుగా పేరెంట్స్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో భారిగా వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.ఈ సందర్భంగా పలువురు యువకులు, విద్యార్థులు మాట్లాడుతూ తాటికల్లు మీదుగా నల్లగొండ వయా నకిరేకల్ కు వేళ్ళే ఎన్ హెచ్ 565 విస్తరణ పనుల్లో సరైన డైరెక్షన్ లేదని,స్కూలుకు సమీపం నుండే రోడ్డు వెళ్లడంతో విద్యార్థులు స్కూలుకు వెళ్లడానికి రోడ్డు దాటవల్సి వస్తుందని,ఆ సమయంలో వేగంగా వాహనాలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని,స్కూల్ ఆవరణలో అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసి వాహనాల నుండి రక్షణ కల్పించాలని కోరారు.స్కూల్ వెళ్లాలంటే,స్కూల్ టైం అయిపోగానే ఇంటికి వెళ్లాలంటే భారీ వాహనాల రాకతో నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా స్కూల్ కు వెళ్లవలసి వస్తుందన్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లోకి వెళ్లాలంటే ఆర్థిక స్తోమత లేకనే మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నామని, కానీ,పాఠశాల ఆవరణ నుండే జాతీయ రహదారి వుండటం వలన పిల్లలకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భయభ్రాంతులకు గురవుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల ముందు అండర్ పాస్ నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube