రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా:రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన గురువారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వట్టిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల పవన్ కుమార్ అతని స్నేహితుడు పొలం నుండి బైక్ పై బయలుదేరారు.

 Both Were Seriously Injured In A Road Accident, Injured, Road Accident, Edla Pa-TeluguStop.com

ఈ క్రమంలో మర్రిగూడ నుంచి అతివేగంగా కూరగాయలతో వెళ్తున్న మినీ వ్యాన్ రాంరెడ్డిపల్లి గ్రామ సమీపానికి రాగానే బైకును ఢీ కొట్టింది.

ప్రమాదంలో బైక్ పై ఉన్న వాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

మినీ కూరగాయల వ్యాన్‌ వేగంగా వెళ్లి ముందున వున్న గుంతలో పల్టీ కొట్టింది.క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పవన్ కాలుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి.అలాగే అతని స్నేహితునికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube