బాలయ్యను జూ. ఎన్టీఆర్ తొలిసారి ఎక్కడ కలిశాడో తెలుసా?

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్.

 First Moment Of Jr Ntr And Balakrishna, Jr Ntr, Blakrishna, First Meeting, Paruc-TeluguStop.com

నందమూరి నటవారసులు.అయితే బాలకృష్ణ ఎన్నో సినిమాలు చేసి టాప్ హీరోగా దశాబ్దాల తరబడి కొనసాగుతన్నాడు.

కానీ జూనియర్ ఎన్టీఆర్ అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.అయితే బాలయ్య, జూ.ఎన్టీఆర్ పరిచయం మాత్రం విచిత్రంగా జరిగింది.అసలు వీళ్లు ఎలా కలుసుకున్నారు అనే విషయాన్ని తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.

తాజాగా ఆయన ఆయన ఛానెల్ లో చేసిన ఓ వీడియో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ఎన్టీఆర్‌, బాలకృష్ణని ఎలా కలుసుకున్నాడు? వీరి కలయికకు ఉన్న సందర్భం ఏంటి? అనే ముచ్చట చెప్పాడు.

Telugu Allari Ramudu, Balayya, Blakrishna, Jr Ntr, Tollywood-Telugu Stop Exclusi

పాలకొల్లులో ఎన్టీఆర్ సినిమా అల్లరి రాముడు షూటింగ్ జరుగుతుంది.అదే సమయంలో పరుచూరితో పాటు ఎన్టీఆర్, దర్శకుడు గోపాల్, నిత్మాత చంటి అక్కడే ఉన్నారు.అప్పుడు జూ.ఎన్టీఆర్ తన దగ్గరికి వచ్చినట్లు చెప్పాడు పరుచూరి.మీరు తాత ఎన్టీఆర్ కు ఎంత అభిమానో.నేను బాబాయ్ బాలయ్యకు అంత వీరాభిమానని అని చెప్పాడట.సినిమా థియేటర్ లో బాబయ్ సినిమా చూస్తుంటే కాగితాలు చింపి విసిరేస్తూ ఎంజాయ్ చేసే వాడిని అని వివరించాడట.వెంటనే కలుగజేసుకున్న పరచూరి.

మరి ఈ విషయాన్ని మీ బాబాయ్ కి చెప్పలేదా అని అడిగాడట.బాబాయ్ అంటే భయం.అందుకే చెప్పాలేని సమాధానం వచ్చిందట.

Telugu Allari Ramudu, Balayya, Blakrishna, Jr Ntr, Tollywood-Telugu Stop Exclusi

నిజానికి ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కూడా అక్కడే ఉన్నాడట.వెంటనే పరుచూరి.మీ బాబాయ్‌తో మాట్లాడిస్తాను అని చెప్పాడట.

తనను చేయి పట్టుకుని బాలయ్య దగ్గరికి తీసుకెళ్లాడట.ఆయనతో మాట్లాడించాడట.

ఒక అభిమానిగానే బాలయ్యను జూ.ఎన్టీఆర్ కలిశాడని చెప్పాడు పరుచూరి.మొత్తానికి ఈ ఇద్దరు కలయికకు పాలకొల్లు వేదిక అయ్యింది అంటాడ ఉండు అని చెప్పి బాలయ్య బాబు దగ్గరికి ఎన్టీఆర్‌ని తీసుకెళ్లాను.ఆయనతో మాట్లాడించాను.అలా ఒక అభిమానిగా ఎన్టీఆర్‌ తన బాబాయ్‌ బాలకృష్ణతో మాట్లాడారని చెప్పాడు.వీరి తొలి సన్నివేశానికి పాలకొల్లు వేదికైంది అని చెప్పుకొచ్చాడు గోపాలకృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube