ఏడాది పొడవునా లభించే పండ్లలో జామ ఒకటి.జామ పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యపరంగా జామ పండ్లు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.అనేక జబ్బులకు అడ్డుకట్ట వేస్తాయి.
అయితే జామ పండ్లు జుట్టు ఆరోగ్యానికి కూడా అండగా నిలుస్తాయని మీకు తెలుసా.? ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా జామ పండ్లను వాడారంటే మస్తు హెయిర్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా బాగా పండిన ఒక జామ పండును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న జామ పండు ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జామ పండు ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ జామ పండు హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
జామ పండు లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడడంలో సహాయపడతాయి.
అలాగే జామ పండులో ఉండే పోషకాలు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేస్తాయి.అలాగే స్కాల్ప్ ని హైడ్రేటెడ్, హెల్తీగా ఉంచుతాయి.ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.జామ పండు హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా సైతం పెరుగుతుంది.