తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను అమలు చేస్తూ వస్తుంది.ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్న సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఫోకస్ పెట్టింది.
ఈ మేరకు ఈనెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని( Indiramma house scheme ) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది.ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఇళ్లు లేని అర్హులు అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు.దీని కోసం విధివిధానాలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందించనుంది.అలాగే ఇంటి నమూనాలు ఇవ్వనున్న సర్కార్ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా నిబంధన విధించింది.ఇల్లు లేని నిరుపేదలకు స్థలంలో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనుంది.ఈ క్రమంలో మొదటి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వనుంది.