ఇటీవల కాలంలో ఎవర్ని ఆరోగ్యం గురించి అడిగినా.మధుమేహం ఉందని చెప్పడం కామన్ అయిపోయింది.
ముసల వారే కాదు.యుక్త వయసులో ఉన్న వారిని కూడా ఈ మధుమేహం వ్యాధి పట్టి పీడిస్తోంది.
అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మధుమేహం వ్యాధి ఏర్పడుతుంది అన్న విషయం అందరికీ తెలుసు.కానీ, బ్లడ్ షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతున్నాయి.
ఏ ఏ కారణాల వల్ల పెరుగుతున్నాయి అన్నవి మాత్రం చాలా మంది పట్టించుకోరు.వాస్తవానికి మనం చేసే తప్పుల వల్లే బ్లడ్ షుగర్ లెవల్స్ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి.
మరి ఆ తప్పులు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక ఒత్తిడి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.సాధారణంగా కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా రియాక్ట్ అవుతూ ఒత్తిడి పెంచుకుంటుంటారు.
దాంతో శరీరంలో విడుదలయ్యే స్ట్రెస్ హార్మోన్స్ ఇన్సులిన్ పై ప్రభావం చూపి.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగేలా చేస్తుంది.
అలాగే ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం ఎక్కువ ఆహారం లాగించేస్తారు.దాంతో క్యాలరీలు పెరుగుతాయి.షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి.అందుకే బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయరాదు.విటమిన్ డి లోపం కూడా మధుమేహానికి దారి తీస్తుంది.
కాబట్టి, విటమిన్ డి శరీరానికి అందెలా చూసుకోవాలి.
అదేవిధంగా, నేటి టెక్నాలజీ ప్రపంచంలో నిద్రను నిర్లక్ష్యం చేస్తూ.
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాపులతోనే ట్రైమ్‌ను గడిపేస్తున్నారు.శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోయినా.
బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరక కదలికలు లేకుండా పోతాయి.
ఇది కూడా మధుహానికి దారి తీస్తుంది.అందువల్ల, కనీసం రెండు గంటలకు ఒకసారి అయినా పైకి లేస్తూ అటూ ఇటూ తిరిగితే మంచిది.