నల్లగొండ జిల్లా:జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కేతావత్ శంకర్ నాయక్ కు పార్టీ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది.ఈ మేరకు టిపిసిసి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
శంకర్ నాయక్ 2019 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.జిల్లా అధ్యక్షుడిగా శంకర నాయక్ అందరినీ కలుపుకుంటూ పనిచేస్తున్నారు.
దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడిగా ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.శంకర్ నాయక్ డిసిసి అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.