అర్ధరాత్రి రోడ్డుపై చచ్చిపడి ఉన్న జింక

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే నుండి నార్కట్ పల్లి పట్టణంలోనికి వచ్చే సర్వీస్ రోడ్ లో శనివారం అర్థరాత్రి సుమారు 1 గంట సమయంలో రోడ్ పై పడి వున్న జింకను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో జింక మరణించి వుండవచ్చని పోలీసులు తెలిపారు.

 A Deer Lying Dead On The Road At Midnight-TeluguStop.com

ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు ఉదయం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.పోలీస్,అటవీ అధికారులు సంఘటన గురించి విచారించి,నిర్లక్ష్యంగా అతి వేగంగా వాహనం నడిపి జింక మరణానికి కారకులైన వాహన యజమానులను గుర్తించి,చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వన్య ప్రాణుల సంరక్షణ కార్యకర్తలు,సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube