నల్గొండ జిల్లా:మిర్యాలగూడలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంలో అపశృతి జరిగింది.క్యాంప్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ వద్ద ప్రమాదవశాత్తు ఎల్ఈడి స్క్రీన్ కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
గాయాలైన విద్యార్థులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారంతా పిల్లలే కావడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదంగా మారింది.