మహిళపై లైంగిక దాడికి యత్నం...పురుగుల మందు సేవించిన మహిళ

నల్లగొండ జిల్లా:ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించగా అవమాన భారంతో పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన మండలంలో శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే… వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గ్రామానికి చెందిన గంట క్రిష్ణయ్య గత నెల 21 తేదీన రాత్రి సమయంలో వివాహిత ఇంట్లో ప్రవేశించి భయపెట్టి లైంగిక దాడికి ప్రయత్నించారు.

 Attempted Sexual Assault On Woman-woman Consumed Insecticide, Attempted Sexual A-TeluguStop.com

గమనించిన కుటుంబ సభ్యులు వెంట పడడంతో పారిపోయాడు.అనంతరం మహిళ మనస్థాపంతో ఇంట్లో ఉన్న పురుగు మందులు సేవించింది.

వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితురాలు కుటుంబ సభ్యులు గత నెల 22వ తేదీన ఫిర్యాదు చేశారు.కేసు నమోదు కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధి సమక్షంలో రాజీ చేయడానికి ప్రయత్నించి విషయాన్ని గోప్యంగా ఉంచారు.

అదే సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించిన కృష్ణయ్య సైతం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.చికిత్స అనంతరం కృష్ణయ్య కోలుకున్నడు.

కానీ, బాధితురాలు పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నదని,లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేసినట్లు,విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube