నల్లగొండ జిల్లా:ఈనెల 6 నుంచి గ్రామాల్లో నిర్వహించనున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని తాహసిల్దార్ కోటేశ్వరి, ఎంపీడీవో శారదాదేవిలు అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో సిబ్బందికి సర్వే సామాగ్రిని అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 12 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 36,175 కుటుంబాలు ఉండగా వివరాలను సేకరించడానికి గాను 54 మంది ఎన్ యు మారేటర్లను ఇట్టి సర్వేను పర్యవేక్షించడానికి ఆరుగురు సూపర్వైజర్ లను నియమించడం జరిగిందన్నారు.
శుక్రవారం ఎన్ యు మారేటర్ల ద్వారా ఇంటింటికి సర్వే సమాచారాన్ని అందించడం జరుగుతుందని,ఈనెల 6 నుంచి ప్రతి ఎన్యూమరేటర్ రోజుకు 10 కుటుంబాల చొప్పున సమగ్ర వివరాలు సేకరిస్తారన్నారు.గ్రామస్తులు సైతం తమ కుటుంబ పూర్తి వివరాలుతో ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీవో లలిత,కార్యదర్శులు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.