సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు వరుసగా సినిమాలను చేస్తున్నాడు.ఇప్పటి వరకు ఆయన కమర్షియల్ గా భారీ విజయాలను సొంతం చేసుకోలేదు.
అయినా కూడా కృష్ణ గారి అల్లుడు.మహేష్ బాబు యొక్క బావ అనే ఇమేజ్ తో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.
ఇదే సమయంలో ఆయన తనకు దక్కిన ప్రతి ఒక్క ఆఫర్ ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతూ ఉంటాడు.కానీ ఆయనకు ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వడం లేదు.
అయితే నటుడిగా మాత్రం మంచి పేరు దక్కింది అనడంలో సందేహం లేదు.బాలీవుడ్ లో సైతం సినిమా చేసిన సుధీర్ బాబు ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలను అక్కడ నుండి దక్కించుకున్నాడు.
కానీ అక్కడ నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలి పోవాల్సిందే అనే ఉద్దేశంతో తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.హిందీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం కన్నా తెలుగులో చిన్న సినిమాలో హీరోగా ఉండడం మంచిదనే ఉద్దేశంతో సుధీర్ బాబు పలు హిందీ సినిమాలకు నో చెప్పాడట, అందులో బ్రహ్మాస్త్రం ఒకటి.
ఈ విషయాన్ని గతంలోనే సుధీర్ బాబు సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.తాజాగా బ్రహ్మాస్త్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమాలోని ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఈ సమయంలో సుధీర్ బాబు మంచి పాత్రని వదులుకొని తప్పు చేశాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
హీరోగానే చేస్తానంటే తప్పు అని.కచ్చితంగా మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతో అన్ని పాత్రలకు ఓకే చెప్పాలంటూ సుధీర్ బాబుకు సన్నిహితులు సలహాలు ఇస్తున్నారు.మరి ఇకపై అయినా సుధీర్ బాబు అన్ని సినిమాలు చేస్తాడా లేదా అనేది చూడాలి.బ్రహ్మాస్త్ర సినిమాలో సెలెక్ట్ అవ్వకుండా తనను సంప్రదించారంటూ చెప్పుకున్నాడని సుధీర్ బాబును కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
నిజంగానే అతడు బ్రహ్మాస్త్ర సినిమాకు సంప్రదించబడ్డాడు.కనుక సుధీర్ బాబు చెప్పిన దాంట్లో తప్పేం లేదు.
అబద్దం అసలే లేదు.







