టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్కుడైన వేణుస్వామి( Venuswami ) కొంతమంది హీరోయిన్లు కెరీర్ పరంగా సక్సెస్ కావాలని పూజలు చేసిన సంగతి తెలిసిందే.అయితే వేణుస్వామి మాట్లాడుతూ అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోనని పేర్కొన్నారు.
నాకు డబ్బులు ఇచ్చే పెద్దపెద్ద క్లైంట్స్ ఉన్నారని ఆయన వెల్లడించారు.పొలిటికల్, టాప్ బిజినెస్ మేన్స్ నా క్లైంట్స్ అని ఆయన అన్నారు.
జ్యోతిష్యం( astrology ) చెప్పి డబ్బులకు కకృత్తి పడే స్టేజ్ లో నేను లేనని వేణుస్వామి వెల్లడించారు.నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్( Real estate business ) ఉందని ఆయన పేర్కొన్నారు.
పబ్ అమ్మేశానని వేణుస్వామి తెలిపారు.రష్మిక ( Rashmika )మాత్రం నాకు డబ్బులు ఇచ్చారని వేరే ఏ హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకోలేదని ఆయన వెల్లడించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బ్లాక్ మ్యాజిక్ ఉందని హీరోలు, హీరోయిన్లు, యాంకర్లు తమకు పోటీగా ఉన్నవాళ్లు ఎదగకుండా చేస్తున్న సందర్భాలు ఉన్నాయని వేణుస్వామి కామెంట్లు చేశారు.ఎవరైతే అనుమతి ఇస్తారో ఆ సెలబ్రిటీల గురించి మాత్రమే నేను వీడియో పెడతానని వేణుస్వామి పేర్కొన్నారు.హీరోయిన్లు డబ్బులు బలవంతంగా ఇస్తామని చెప్పినా గ్రూప్ లో పూజ చేసిన పండితులకు 50,000 రూపాయలు ఇవ్వమని చెబుతానని ఆయన తెలిపారు.

బిజినెస్ మేన్స్ నుంచి నాకు 10 లక్షలు వస్తాయని వేణుస్వామి వెల్లడించారు.అమ్మాయిలలో నేను అమ్మవారిని చూశానని ఆయన వెల్లడించారు.కరోనా సమయంలో ఒక వృత్తిలో పని చేసే అమ్మాయిలకు నేను 40 లక్షల రూపాయలు డొనేట్ చేశానని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
అమ్మాయిలు ఎవరైనా బాధ పడుతుంటే తాను డబ్బు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన వెల్లడించారు.అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు పంచిన సందర్భాలు ఉన్నాయని వేణుస్వామి పేర్కొన్నారు.
శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాలని మద్యం గురించి మాట్లాడటమే దోషం అని భావించవద్దని ఆయన తెలిపారు.దానమే పరిహారం అని ఆయన వెల్లడించారు.







