నల్లగొండ జిల్లా:వేములపల్లి మండలం( Vemulapally mandal )లో పారిశుద్ధ్యం పడకేసింది.ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలలో ఎక్కడ చూసినా మురుగునీరు నిల్వలు,రోడ్లన్నీ బురదమయమై చిత్తడిగా మారడంతో దోమలు( Mosquitoes ) స్వైర విహారం చేస్తున్నాయి.
సాయంత్రం ఆరు దాటితే చాలు దోమలు ప్రజలు చుక్కలు చూపిస్తున్నాయి.
దీనితో చిన్న పిల్లలు,వృద్ధులు, రోగాల బారినపడి సతమతవుతున్నారు.
ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అధికారులు దోమల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తొలగించి, దోమల మందులు పిచికారీ చేయించి,ప్రజారోగ్యాన్నీ కాపాడాలని కోరుతున్నారు.