వారానికి 2 సార్లు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఆరోగ్యం అందం రెండు పెరుగుతాయి!

సాధారణంగా చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో దోస, ఇడ్లీ, చపాతీ, పూరీ, వడ వంటివి తింటూ ఉంటారు.వాటి వల్ల కడుపు నిండుతుందేమో కానీ ఆరోగ్యపరంగా ప్రయోజనాలేమి ఉండవు.

 This Smoothie Will Boost Your Health And Beauty! Healthy Smoothie, Latest News,-TeluguStop.com

అందుకే బ్రేక్ ఫాస్ట్ లో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.ముఖ్యంగా వారానికి రెండు సార్లు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ స్మూతీని మీ బ్రేక్ ఫాస్ట్ ( Breakfast )లో కనుక చేర్చుకుంటే ఆరోగ్యం, అందం రెండు పెరుగుతాయి.

Telugu Tips, Latest, Papayabanana-Telugu Health

స్మూతీ తయారీ కోసం.బ్లెండర్ తీసుకుని అందులో అర క‌ప్పు బొప్పాయి పండు( Papaya ) ముక్కలు, ఒక అరటిపండు, మూడు నుంచి నాలుగు పాలకూర ఆకులు వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి పాలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన స్మూతీ అనేది రెడీ అవుతుంది.ఈ బొప్పాయి అరటి పాలకూర స్మూతీ చాలా రుచిగా ఉంటుంది.

అలాగే ఈ స్మూతీ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది.అందువ‌ల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.బొప్పాయి అరటి పాలకూర స్మూతీలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ప‌నితీరును పెంచుతుంది.ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.మలబద్ధకం స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది.

అలాగే ఈ స్మూతీలో విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ ఎ వంటి విట‌మిన్లు నిండి ఉండ‌టం వ‌ల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుండి చ‌ర్మానికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.స్కిన్ ఏజింగ్ ఆల‌స్యం అవుతుంది.

చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

Telugu Tips, Latest, Papayabanana-Telugu Health

వారానికి రెండుసార్లు బొప్పాయి అర‌టి పాల‌కూర‌ స్మూతీని తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం, అలసట వంటివి ద‌రిదాప్పుల్లోకి రాకుండా ఉంటాయి.ఈ స్మూతీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ( Free radicals )దెబ్బతీయ‌కుండా రక్షిస్తాయి.

వివిధ రకాల క్యాన్సర్ల రిస్క్ ను త‌గ్గిస్తాయి.అంతేకాదు ఈ స్మూతీ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని నివారించడంలో తోడ్ప‌డుతుంది.

రాత్రిపూట మంచి నిద్రను సైతం అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube