సత్తిబాబు జగన్ నమ్మకాన్ని నిలబెడతారా  ? 

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ ( YCP )తరఫున సీనియర్ పొలిటిషన్ మాజీ మంత్రి భర్త సత్యనారాయణ ను పోటీకి దింపుతున్నారు వైసీపీ అధినేత జగన్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో,  వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్తీసుకున్నారు.

 Will Botsa Satyanarayana Jagan Keep His Faith?, Botsa Satyanarayana, Ysrcp Mlc-TeluguStop.com

ఉత్తరాంధ్రలో గట్టిపట్టున్న నేతగా,  సీనియర్ పొలిటిషన్ గా ఉండడంతో బొత్స అయితేనే సరైన అభ్యర్థని జగన్ భావించారు.దీంతో ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు.

దీంతో జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుని గెలవడం బొత్స కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 600కు పైగా ఓట్లు ఉన్నాయి.

టిడిపి కూటమికి 250 కి మించి లేవు.దీంతో బొత్స తన గెలుపు ధీమా గానే ఉన్నారు.

అయితే ఇక్కడే టిడిపి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ను( Botsa satyanarayana ) పోటీకి దింపుతుండడంతో,  ఊహించని షాక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

Telugu Ap Jagan, Jagan, Janasena, Telugudesam, Ysrcp Mlc Candi-Politics

టీచర్ల బదలీ విషయంలో ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.మరోవైపు చూస్తే ఉత్తరాంధ్రలో కీలక నేతగా బొత్సకు జగన్ ఆ స్థాయిలోనే గౌరవ మర్యాదలు ఇస్తున్నారు.అందుకే ఈసారి ఎన్నికల్లో ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యాన్ని బొత్స కు ఇచ్చారు.2024 ఎన్నికల్లో ఆయన కుటుంబానికి నాలుగు టికెట్లు ఇచ్చారంటే బొత్స పై జగన్( Jagan ) కు ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.పార్టీ ట్రబుల్ షూటర్ గాను ఆయనకు గుర్తింపు ఉంది.  జగన్ ఐదేళ్లలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చిన బొత్సకు ఆ స్థాయిలోనే జగన్ గౌరవాన్ని ఇస్తున్నారు.

కాకపోతే మొన్నటి ఎన్నికల్లో కుటుంబంలో పోటీ చేసిన అందరూ ఓటమి చెందారు.

Telugu Ap Jagan, Jagan, Janasena, Telugudesam, Ysrcp Mlc Candi-Politics

చీపురుపల్లిలోనూ బొత్స ఓటమి చెందారు.ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు అధికార పార్టీ అనేక వ్యూహాలు రచిస్తోందనే విషయం బొత్స కు తెలియనిది కాదు.  స్థానిక సంస్థల ఓటర్లను కాపాడుకోవడం ఆయనకు అది ముఖ్యమైన అంశం.

  ఇప్పటికే 12 మంది విశాఖ మున్సిపల్ కౌన్సిలర్లు టిడిపిలో చేరిపోయారు.మిగిలిన వారు పార్టీని వీడకుండా కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఆయనపై ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube