నల్లగొండ జిల్లా: గుర్రంపోడ్ మండలం కొప్పోల్ గ్రామంలో పిఏసిఎస్ సొంత భవనం ఉన్నప్పటికీ మండల కేంద్రంలో అద్దె భవనంలో నిర్వహిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కొప్పోల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే రెండు మూడు అద్దె భవనాలు మార్చారు.
కానీ,కొప్పోల సొసైటీ సొంత భవనాన్ని మాత్రం వినియోగంలోకి తేవడం లేదని,దీనితో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని అంటున్నారు.
కొప్పోల్ సొసైటీ భవనానికి చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయించి వాడుకుంటే ప్రయోజనం ఉంటుందని, అద్దె భవనంలో నిర్వహించడం వల్ల ఎవరికి లబ్ది జరుగుతుందో అర్దం కావడం లేదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అద్దె భవనంలో కాకుండా సొసైటీని కొప్పోల్ సొంత భవనంలో నిర్వహించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.