నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంగళవారం సాయంత్రం తిరిగి నీటి విడుదల చేశారు.14 రోజుల కిందట ఎడమ కాలువకు గండిపడి నీటిని అధికారులు నిలిపివేసిన సంగతి తెలిసిందే.మరమ్మతుల అనంతరం మంగళవారం సాయంత్రం ఎన్ఎస్పి అధికారులు నీటి విడుదల చేశారు.రెండు వారాలుగా నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందారు.ఎట్టకేలకు గండి మరమ్మతులు పూర్తి చేసి నీటి విడుదల చేయడంతో రైతాంగంలో పంటలపై ఆశలు పెరిగాయి.