బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఇంకెన్నాళ్లు?

ప్రధానమంత్రికి ప్రజా నేస్తం బోరన్నగారి సుభాషన్న బహిరంగ లేఖ.జనాభాలో ఏడు శాతం ఉన్న రెడ్లకు 107 మంది ఎమ్మెల్యేలా?ఇది ప్రజాస్వామ్యమా? రెడ్డి,కమ్మ,వెలమ దొరల రాజభోగమా?బీసీలకు విద్య,ఉద్యోగ,సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాలలో దామాషా ప్రాతినిధ్యం దక్కాలని సిపిఐ ఎంఎల్ కార్యదర్శి విప్లవ నేతాజీ బోరన్న గారి డిమాండ్.అసెంబ్లీ,పార్లమెంటు సీట్లు అగ్రకులాలకే అగ్రిమెంట్లా? ప్రధానమంత్రిని ప్రశ్నిస్తూ ప్రజాబంధువు కామ్రేడ్ బోసన్న కర్తవ్య లేఖ.ఓట్లు బహుజనులవి సీట్లు అగ్రకులాలవా? ఇంకెంతకాలం బీసీలను మోసం చేస్తారు ప్రధానమంత్రి గారు?బీసీ ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో బీసీల బ్రతుకులు బిచ్చగాళ్ళ కంటే హీనమా? పేరుకు 56% ప్రాతినిధ్యంలో 14 శాతమా?ప్రతివారికి శాఖ బీసీలకు ఏది ప్రత్యేక శాఖ?జనాభా చాలా పెద్దది బీసీల బడ్జెట్ మాత్రం చాలా చిన్నదా?

 How Many More Years Of Upper Caste Occupation Of Bc Chairs?-TeluguStop.com

నల్లగొండ జిల్లా: కులవాదిగా కాదు,కుల నిర్మూలన వాదిగానే ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై భారత ప్రధానమంత్రికి బహిరంగ లేఖ వ్రాసిన సిపిఐ ఎంఎల్ కార్యదర్శి బోరన్న గారి సుభాషన్న.దేశ నిర్మాణ అభివృద్ధిలో త్యాగాలు బీసీలవి, రాజభోగాలు మాత్రం అగ్రకులాలవా? ఇదేనా దేశం వెలిగిపోవడం అంటే?ఇదేనా స్వతంత్రం అంటే?తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాలు ఉన్నది 20 శాతం లోపేనని,అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలో అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం 199 మంది ఉన్నారని అందులో 107 మంది రెడ్డి లేనని,మిగతావారు కమ్మ,కాపు,వైశ్య,వెలమ,క్షత్రియ,బ్రాహ్మణ అగ్రకులాలు ఉన్నాయని ప్రజా బంధువు సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ బోరన్న గారి సుభాషన్న ఆరోపించారు.జనాభాలో 56% ఉన్న బీసీ కులాలకు 294 స్థానాలు ఉన్న అసెంబ్లీలో కనీసము 160 స్థానాలైన ఉండాలని ప్రజాస్వామిక వాదులు ఆశిస్తారని కానీ,బీసీలు 40 మంది మాత్రమే ఉన్నారని బోరన్న పేర్కొన్నారు.

ఎస్సీ,ఎస్టీలకు వారి వారి జనాభా శాతం మేరకు అసెంబ్లీ స్థానాల్లో రాజ్యాంగ రీత్యా సంక్రమించిన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి,ఎస్సీలు 39 మంది ఎస్టీలు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని,అయితే దారుణమైన అన్యాయం జరుగుతున్నది కేవలం వెనుకబడిన తరగతులైన బీసీ కులాలకేనని ప్రజా నేస్తం బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ నేతాజీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు భారత ప్రధానమంత్రికి సిపిఐ ఎం-ఎల్ కార్యదర్శి కామ్రేడ్ సుభాషన్న నేడు ఒక బహిరంగ లేక వ్రాస్తూ రెడ్డి,కమ్మ,వెలమ,బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య కులాలు పట్ల ఈర్ష ద్వేషంతో ఈ బహిరంగ లేక వ్రాయడం లేదని స్వతంత్ర భారతదేశ ఫలితాలు అన్ని కేవలం 20 శాతం కూడా లేని అగ్రకులాలుగా పిలవబడే తక్కువ జనాభా వారు అనుభవిస్తుంటే,విద్య,ఉద్యోగ,ఆర్థిక,రాజకీయ, సామాజిక,సాంస్కృతిక రంగాలన్నిటిని కేవలం ఈ తక్కువ జనాభా ఉన్న కులాలే కబ్జా పెట్టి పీకల దాకా మెక్కుతుంటే మాత్రం కడుపు మండిపోతుందని కామ్రేడ్ బోరన్న పేర్కొన్నారు.స్వసంత్రం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా ఏనాడు కనీసం ఒకసారి కూడా అసెంబ్లీ గడప తొక్క లేకపోయినా అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాల ధైన్యస్థితిని ఒక బీసీ బిడ్డగా మీ మనసులోకి రాకపోవటం నిజంగా బాధాకరమని భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బహిరంగ లేఖలో మరో బిసి యాదవ బిడ్డ బోరన్నగారి సుభాషన్న తీవ్రంగా విమర్శించారు.8 అక్టోబర్ 2021 అయినా 100 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని పూర్తిచేసుకుని అమరురాలైన వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాట శ్రామిక యోధురాలు 1935వ సంవత్సరంలోని మానుకోట గ్రామానికి మహాత్మా గాంధీ వస్తే స్వతంత్ర పోరాటానికి తన చెవులకున్న బంగారం దిద్దులను, నాలుగు మేకలను విరాళంగా ఇచ్చిన త్యాగశీలి, సూర్యాపేట జిల్లా ఏపూరి గ్రామానికి చెందిన తన తల్లి మున్న గంగమ్మ లింగయ్య యాదవ్ భారతదేశానికి మొదటిసారిగా ఒక ఛాయ్ అమ్మే బిడ్డ బీసీ కులానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఎంతగానో సంతోషించారని ప్రజా ఉద్యమకారుడు బోరన్న పేర్కొన్నారు.తన తల్లి మున్న గంగమ్మ లాంటి కోట్లాదిమంది బహుజన కులాల తల్లులు దీవిస్తే రెండవ సారి కూడా భారీ మెజార్టీతో భారత ప్రధానిగా వెలుగుతున్న నరేంద్ర మోడీ చీకట్లో మగ్గుతున్న 69 కోట్ల బీసీ కులాల ప్రజల జీవితాలకు వెలుగులు తెచ్చే ఆలోచన చేయకపోవడం ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాకపోవటం దారుణమని బీసీ(డీ) యాదవ సామాజిక వర్గానికి చెందిన గొర్రెల,మేకల కాపుల దారుడి కుటుంబానికి చెందిన ఓటరుగా ఎంతో బాధపడుతున్నానని బహుజన రాజ్యాధికార స్వప్నికుడు బోరా సుభాషన్న 9848540078 బహిరంగ లేఖలో పేర్కొన్నారు.దేశంలో కులాల మధ్య ఏర్పడ్డ అసమానతులను రూపుమాపాలంటే వారి వారి జనాభా లెక్కలు తప్పనిసరని భావించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1872 నుంచి 1931 వరకు కులాల వారీగా జనాభా లెక్కించారు.

దేశానికి స్వతంత్రం తర్వాత 26 జనవరి 1950 నరాజ్యాంగం అమల్లోకి వచ్చింది.వివిధ అధికారణల ద్వారా ఎస్సీ,ఎస్టీలకు వారి జనాభా దామాషా పద్ధతిలో విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో పంచాయితీ నుండి పార్లమెంటు అసెంబ్లీల వరకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్న అగ్రకుల పాలకులకు బీసీ కులాల ప్రజలను కనీసం మనుషులుగా చూడటం లేదని బోరా సుభాషన్న పేర్కొన్నారు.

కుక్కలకు,పశువులకు,చెట్టు,పుట్టలకు లెక్కలు వ్రాస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకవర్గాల ప్రభువులారా బీసీ కులాల లెక్కలు ఎందుకు చేపట్టడం లేదని ప్రజాబంధువు బోరన్న ప్రశ్నించారు.అత్యంత అప్రజస్వామికమైన రీతిలో ఆర్టికల్ 370 ను రద్దుచేసి కాశ్మీర్ ఫైల్స్ చూడాలంటున్న మోడీ ప్రభుత్వానికి దేశంలో బీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ఫైల్స్ ను చూసే సమయం లేకపోవడం దారుణమని సీపీఐ (ఎంఎల్)సెక్రెటరీ బోర శుభాషన్న పేర్కొన్నారు.

చైనా,పాకిస్తాన్లకు చుక్కలు చూపెట్టే హీరో మాత్రం బీసీల విషయానికొస్తే జీరో ఎందుకు అవుతున్నాడో మోడీనే చెప్పాలని తక్షణమే దేశంలో ఓబీసీ జనాభా లెక్కించాలని సుభాషన్న కోరారు.రిజర్వేషన్ల పరుగులు వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని కులదరణకు భయపడ వద్దని బిసి కులాల వారిగా జనాభా గణన చేపట్టాలని,పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన పార్టీలన్నీ గుర్తింపు పొందిన 22 రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన పార్లమెంట్లో మాట్లాడిన చెవిటివాడు ముందు శంఖమూదినట్లుగానే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని బోరన్న తెలిపారు.

భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఏడు కేంద్రప్రాలిత ప్రాంతాలలో 543 లోక్ సభ సీట్లలో 245 రాజ్యసభ సీట్లలో 426 ఎమ్మెల్సీ సీట్లలో 436 అసెంబ్లీ సీట్లలో బీసీ కులాల ప్రాతినిధ్య శాతం ఎంతనో చెప్పాలని నరేంద్ర మోడీని సుభాషన్న డిమాండ్ చేశారు.బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలా,పన్నులు కట్టి మనుషులా? మీ రాజకీయాలకు జై కొట్టే బానిసలా? భారతదేశ అభివృద్ధికి శ్రమ చేసే శ్రామిక కులాల పార్లమెంటు అసెంబ్లీల భవనాలు కట్టే బానిసలా? అగ్రకుల దొరల గడీల ముందు కాపల కుక్కలా? తేల్చి చెప్పాలని 66 కోట్ల మంది బీసీ ప్రజల తరఫున అడుగుతున్న ఈ ప్రశ్నలకు దమ్ముంటే జవాబు చెప్పాలని ప్రజాయితాన్ని కాంక్షించే ప్రజాభ్యుదయవాది బీసీ ప్రజల కార్యకర్త బోరన్న గారి సుభాషన్న వ్రాసిన బహిరంగ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను పరిపాలిస్తున్న పాలక ప్రభువులకు రాజకీయ పార్టీలకు బీసీ గోడు వినబడటం లేదని అనేక సంవత్సరాలుగా బీసీల సమస్యలపై ధర్నాలు, ర్యాలీలు,సభలు,సమావేశాలు జరుగుతున్నా ఆర్.కృష్ణయ్య 9000009164,జాజుల శ్రీనివాస్ గౌడ్ 9866699155 లా ఆధ్వర్యంలో వందలసార్లు ఢిల్లీలో ధర్నాలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదని, విజయ విహారం జై భారత్ విప్లవకారుడు టీవీ రమణమూర్తి 9848030089 బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చరిత్ర విద్యార్థులు పరిశోధన చేసే పుస్తకాలు రాసిన,పోరాటాలు చేసిన ఎందుకు చలనం లేదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కమ్యూనిస్టు నేతాజీ సీపీఐ (ఎంఎల్) బోరన్నగారి సుభాషన్న ప్రశ్నించారు.బీసీల గోడు వినకుండా చెవులు మూసుకుంటే బీసీ ప్రజా ఉద్యమాలను చూడకుండా పాలకులారా మీరు కళ్ళు మూసుకుంటే సూర్యోదయం చీకటి అయిపోతుందా? అంటూ ప్రధానమంత్రిని బహిరంగ లేఖలో బీసీ బంధువు,బోరన్న గారి సుభాషన్న 8328277285 ప్రశ్నించారు.తెలుగు రాష్ట్రాలలో ఏడు శాతం జనాభా లేని రెడ్లు 107 మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీని కబ్జా పెడితే దేశవ్యాప్తంగా అగ్రకులాల వారు ఏ విధంగా చట్టసభలను కబ్జా పెట్టారో ఇట్టే అర్థం కావడం లేదా అని బోసన్న పేర్కొన్నారు.

వివిధ కులాల మధ్య ఉన్న భౌతిక, పాదార్తిక,సామాజిక,రాజకీయ,అసమానతులను వివక్షతను తీసేయకుండా భారతదేశం వెలిగిపోవడం అనేది ఒట్టి భ్రమగా మిగిలిపోతుందని కులవాదిగా కాదు, కుల నిర్మూలన కోరుకునే విప్లవకారుడుగా ఇవాళ దేశంలో బీసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రధానమంత్రికి బహిరంగ లేఖ వ్రాసినట్లు ప్రజా ఉద్యమకారుడు బోరన్న గారి సుభాషన్న స్పష్టం చేశారు.తెల్ల దొరలను తరిమి కొట్టి తెచ్చుకున్న స్వతంత్రంలో బీసీలకు పాత్ర లేదా అని ప్రశ్నిస్తూ తెల్లదొరలు పోయిన నల్ల దొరలే రాజ్యమేలుతున్నారని బీసీలను కనీస పౌరులుగా చూడటం లేదని బోరన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో తక్కువ జనాభా ఉన్న అగ్రకులాలు అనబడేవారు అంతులేని సిరిసంపదలు పదవులు అనుభవిస్తుంటే అత్యధిక జనాభా శాతం కలిగిన బహుజన కులాలను నిర్లక్ష్యం చేయడం అనేది అన్నింటికంటే పెద్ద జాతీయ నేరంగా బోరన్న పేర్కొన్నారు.మన నాగరికత శిధిలమవడానికి ఇదొక కారణంగా ప్రజా కార్యకర్త బోసన్న పేర్కొన్నారు.నడిచే శవాలుగా,బరువులు మోసే జంతువులకంటే హీనంగా ఓట్లు వేసే యంత్రంగా,తాజ్ మహల్ నిర్మాణానికి రాలేత్తిన కూలీలుగా,దేశ సిరిసంపద సృష్టిస్తున్న శ్రమజీవులుగా,పాలక పార్టీల ప్రజాస్వామ్య ముసుగు ధరించిన ఆధునిక నల్ల దొరల పల్లకి మోసే బోయిలుగా,బానిసకు ఒక బానిసలుగా,బతుకులు భారంగా మోస్తున్న బడుగు బలహీనవర్గాల అభివృద్ధి గురించి రాజకీయ వాటాల గురించి బీసీ బిడ్డ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ కాలంలోనైనా పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రధానేస్తం సుభాషన్న డిమాండ్ చేశారు.130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 66 కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీ కులాల శ్రమ,ఐశ్వర్యం,సకల సంపదలను జనాభాలు పిడికెడు మంది లేని నల్ల దొరలే లాగేసుకుంటుంటే,ఖరీదైన కార్లతో,భవనాలతో,దుస్తులతో,బంగారం,వజ్ర వైడుర్యాలతో,విందులతో,పసందులతో,విలాసాలతో మునిగితేలుతుంటే కోట్లాదిమంది బీసీ కులాల ప్రజలు ఆర్థిక అన్యాయానికి గురవుతుంటే,ఆకలి అజ్ఞానం అనుభవిస్తుంటే ప్రశ్నించకుండా నిద్రపోతున్న ప్రతి ఒక్క మేధావి ఈ దేశ నేరస్తుడేనని బోరన్న గారి సుభాషన్న పేర్కొన్నారు.పార్లమెంట్ అసెంబ్లీలను సకల ప్రజా ప్రాతినిధ్య సభలను కబ్జాలుగా చేసుకొని రాజ్యమేలుతున్న అగ్రకురాల నుండి విముక్తి చేయాలని,చట్టసభలను బీసీలకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలని,చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రజాతంత్ర వాది బోరన్న గారి సుభాషన్న 9848540078 కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సామాజిక న్యాయం మాటల్లో కాదని ఆచరణలో చూపాలని కోట్లాదిమంది బీసీ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురావడానికి ఒక బీసీ బిడ్డగా ప్రధానమంత్రి ఉన్నా నరేంద్ర మోడీ పదవి కాలంలోనే ఈ ప్రయత్నాలు జరగాలని ఇందుకు వట్టి మాటలతో కాదు గట్టి మేలు తల పెట్టాలని బోరన్న సుభాష్ చంద్రబోస్ నేతాజీ నేడు ఒక బహిరంగ లేఖలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు.

పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు సకల సభలలో బీసీలకు వారి జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం 56% రిజర్వేషన్లు కల్పించి భారతదేశ నిజమైన బహుజన వర్గాల ఆత్మీయుడుగా నరేంద్ర మోడీ నిరూపించుకోవడానికి తగిన సమయం ఆసన్నమైనదని నరేంద్ర మోడీకి బోరన్నగారు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube