నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( TelanganaState )లో రోజురోజుకు భానుడి భగభగలు అధికంఅవుతూ ఎండలు ముదురుతున్నాయి.పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి.
గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.రాగల ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ( Hyderabad Meteorological Centre )వెల్లడించింది.
ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకునే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37, కనిష్టంగా 24డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
తరువాత 48గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.సగటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38నుంచి 41డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.రాష్ట్రంలో మంగళవారం ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపిం ది.12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.నిర్మల్,నిజామాబాద్( Nirmal, Nizamabad ), కొమరంభీం,అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల,రంగారెడ్డి, పెద్దపల్లి,ములుగు, కరీంనగర్,వరంగల్ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జాబితాలో ఉన్నాయి.ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.