పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత చేసిన సర్వేలలో పిఠాపురంలో( Pithapuram ) పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.మరోవైపు కొన్ని సర్వేలలో మాత్రం హోరాహోరీ పోరు ఉండబోతుందని ఏ పార్టీ గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే పవన్ గెలిస్తే టీడీపీ అభ్యర్థి వర్మ( TDP Candidate Varma ) పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని ప్రచారం జరుగుతోంది.
పవన్ పిఠాపురం నుంచి ఒక్కసారి గెలిస్తే భవిష్యత్తులో ఇదే నియోజకవర్గంపై ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.
వర్మకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP Janasena BJP Alliance ) అధికారంలోకి వస్తే ఏదైనా పదవి ఇచ్చినా ఆ పదవి వల్ల కలిగే ప్రయోజనం తక్కువేనని చెప్పవచ్చు.పిఠాపురం మినహా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం వర్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పిఠాపురం నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తుందని పవన్ చెబుతున్నా ఆ రేంజ్ మెజారిటీ సులువు కాదని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు సొంతమవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అయితే పవన్ మరింత కష్టపడితే మాత్రమే ఆశించిన రేంజ్ లో ఫలితాలు వస్తావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2024 ఎన్నికల్లో విజయం కోసం అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు తెగ కష్టపడుతున్నారు.

వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto ) అంతకంతకూ ఆలస్యమవుతుండగా మేనిఫెస్టో రిలీజైతే మాత్రమే వైసీపీకి బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.టీడీపీ నేతలు మాత్రం సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.ప్రచారం విషయంలో ఏ రాజకీయ పార్టీ వెనక్కు తగ్గడం లేదు.పిఠాపురంలో గెలుపు కోసం వైసీపీ నేత వంగా గీత( Vanga Geetha ) సైతం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.