రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్, సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరయ్యారు .
అనంతరం వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని , బహుజన వర్గాలను ఏకం చేసి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు మాయావతి ని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాన్షీ రాం ది.
అలాగే భోజనాలకు నీ అగ్రవాదుల పార్టీలో ఆత్మగౌరవం దక్కదని బహుజనులకే 1984 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి,మూడవ జాతీయ పార్టీగా చేసి చూపిన ఘనత కాన్షిరాం ది.బహుజన జనాలంతా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకమై రాజ్యాధికారం సాధించాలంటే ఒక్క బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు న్యాలకంటి లక్ష్మీరాజం, అందె శ్రీనివాస్,మండల కార్యదర్శి లు గునుగంటి చిరంజీవి, బొడ్డు కిషన్, అందే ఈశ్వర్, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డమీది సాయి చంద్, అందె బాబు,గడ్డం నవీన్,అందే గణేష్, దాసరి దేవ చంద్రం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.







