నల్లగొండ జిల్లా: ఏ ఒక్కరూ అడగకుండానే పేదింటి ఆడపడుచులకు కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ ల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షా 116 లు కట్నంగా అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఆడపిల్ల పెండ్లి పేదలకు భారంగా పరణమించకూడదు అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని చెప్పారు.
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మునుగోడు, చండూరు మండలాల పరిధిలోని 297 మంది కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ లబ్ధిదారులకు 2 కోట్ల 97 లక్షల 34 వేల 452 రూపాయల చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు.అనంతరం మునుగోడు మండల రెవిన్యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ పధకం పెట్టాలన్నది ఏ ఒక్కరి నుండి వచ్చిన డిమాండ్ కాదని స్పష్టం చేశారు.
మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే రూపొందించిన అద్భుతమైన పధకంగా ఆయన అభివర్ణించారు.ఆడపిల్లల పెండ్లి పేరుతో జరుగుతున్న అప్పులను నివారించడంతో పాటు,ప్రభుత్వం నుండి అందుతున్న మొత్తంతో ఇంటిల్లి పాదికి ఉపశమనం కలిగించేలా తీసుకున్న నిర్ణయమని కొనియాడారు.
ప్రభుత్వం అందించే చెక్కును కుడా ఎవరి పేరుతో ఇవ్వాలన్నది తర్జనభర్జనలు జరిగిన మీదటనే పెండ్లి కూతురు తల్లి పేరిట ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించి మహిళ పక్షపాతిగా ముద్ర వేసుకున్నారన్నారు.కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.
దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణాలో మాత్రం ఎటువంటి అవాంతరాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉందన్నారు.మునుగోడు నియోజకవర్గ పరిధిలో రెండో మారు జరిగిన మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన ఆసాంతం విజయవంతంగా సాగింది.
ప్రత్యేకించి క్షల్యాణాలక్ష్మి/షాది ముబారక్ ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ఉద్దేశించ బడిన ఈ పర్యటన రెండో మారు అదే స్పీడ్ అదే జోరుగా సాగింది.ఫిబ్రవరి 24 న మొదటి సారి పర్యటన గులాబీ దండులో పెంచిన జోష్ రెండోమారు పర్యటనలో మరింత పెంచింది.
*దివ్వాంగులకు మోటోరైజ్డ్ వెహికల్స్ పంపిణీ*
ఇదిలా ఉండగా మునుగోడు మండల పరిధిలోని 13 మంది దివ్గ్వాంగులకు మోటోరైజ్డ్ వెహికల్స్, బ్యాటరీ వీల్ ఛైర్స్, ల్యాప్ టాప్ లు,4జి మొబైల్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు.86,000 రూపాయలు విలువ కలిగిన మోటోరైజ్డ్ వెహికల్స్ ఐదుగురికి,58,000 రూపాయల విలువ గలిగిన బ్యాటరీ వీల్స్ ఐదుగురికి,35 వేల రూపాయల విలువ చేసే ల్యాప్ ట్యాప్ లను ఇద్దరికి,10,000 రూపాయల విలువ చేసే 4జి మొబైల్ ను ఒక్కరికి అందజేశారు.యింకా ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,జడ్పిటిసిలు ఎన్.స్వరూపా రవి,కర్నాటి వెంకటేశం,మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.