గుండెకు అండ‌గా ఉండే ఈ ఆహారాల‌ను మీరు తీసుకుంటున్నారా..?

ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత జబ్బులతో సతమతం అవుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.జంక్ ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్ర‌ను నిర్లక్ష్యం చేయడం, మద్యపానం, ధూమపానం, పోషకాహారం తీసుకోకపోవడం తదితర అంశాలు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

 These Are The Foods That Are Good For Heart Health, Good Foods, Heart Health, He-TeluguStop.com

ఫలితంగా గుండెకు ముప్పు పెరిగిపోతోంది.అందుకే ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతుంటారు.

ముఖ్యంగా గుండెకు అండగా నిలిచే కొన్ని కొన్ని ఆహారాలు ఉన్నాయి.వాటిని తీసుకోవడం వల్ల గుండెకు పెరిగే ముప్పును తగ్గించుకోవచ్చని అంటున్నారు.మరి ఇంతకీ ఆ ఆహారాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఓట్స్.

 These Are The Foods That Are Good For Heart Health, Good Foods, Heart Health, He-TeluguStop.com

.గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహారం గా చెప్పుకోవచ్చు.ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.మరెన్నో పోషక విలువలు సైతం నిండి ఉంటాయి.ఓట్స్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవడమే కాదు గుండె పనితీరు సైతం చురుగ్గా సాగుతుంది.

అలాగే గుండెకు మేలు చేసే వాటిలో గ్రీన్ టీ ఒకటి.రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే వివిధ రకాల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.బాదం, జీడిపప్పు, వాల్ న‌ట్స్‌, పిస్తా, వేరుశెనగలు వంటి నట్స్‌లో గుడ్ కొలెస్ట్రాల్ స‌మృద్ధిగా నిండి ఉంటుంది.

వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి.

చాక్లెట్స్.ఆరోగ్యానికి మంచివి కాదని అంటుంటారు.కానీ డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

సోయా ఉత్పత్తులు గుండెకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.అందుకే సోయా బీన్స్, సోయా పాలు తదితర సోయా ఉత్పత్తులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక చేపలు, పెరుగు, అవిసె గింజలు, నువ్వులు, క్యాప్సికం, టమాటో వంటి ఆహారాలు సైతం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Video : These Are The Foods That Are Good For Heart Health, Good Foods, Heart Health, Healthy Heart, Latest News, Health, Heart, Health Tips, Good Health, Healthy Foods #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube