పొలం సర్వే కోసంలంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్

పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో విలేజ్ సర్వేయర్ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.సెట్టి నూకరాజు అనే రైతుకు చెందిన 10 ఎకరాల 4 సెంట్ల పొలానికి చెంది సర్వే చేసే విషయమై రూ.10 వేలు డిమాండు చేసారు.ఈ క్రమంలో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు విలేజ్ సర్వేయర్ నాగేశ్వర రావును పట్టుకున్నారు.

 Caught Taking Bribe For Farm Survey  Surveyor-TeluguStop.com

ఈ మేరకు టోల్ ఫ్రీ నంబర్ 14400 ద్వారా తమకు ఫిర్యాదు రాగా కాండ్రకోట సచివాలయం వద్ద నిఘా వేసి, రైతు నుంచి డబ్బులు తీసుకున్న సమయంలో పట్టుకున్నట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య వెల్లడించారు.అతని చేతులు సైతం పరీక్షించగా డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు అడిషనల్ ఎస్పీ సౌజన్య చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాలలో ఏ పనికయినా సిబ్బంది డబ్బులు లంచంగా అడిగితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 14400 కి ఫోన్ ద్వారా పిర్యాదు చేయాలని అడిషనల్ ఎస్పీ సౌజన్య కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube