నల్లగొండ జిల్లా:మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని నల్లగొండ ట్రాఫిక్ సిఐ బి.డానియల్ కుమార్ హెచ్చరించారు.శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్( Drunk and Drive ) పరీక్షల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 34 మందిని నల్లగొండ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని,వీరిలో ఒకరికి 5 రోజులు, ఒకరికి 2 రోజులు, నలుగురికి 1 రోజు జైలు శిక్ష విధించగా,మిగిలిన 28 మందికి రూ.30 వేల జరిమానా విధించారని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Latest Nalgonda News