ఈ సలాడ్ డైట్ లో ఉంటే చాలు.. వెయిట్ లాస్ తో సహా ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు అనేది దాదాపు అందరికీ అతి పెద్ద శత్రువు గా మారింది.ఈ క్రమంలోనే పెరిగిన బరువును కరిగించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

 This Salad Add In Your Diet, You Will Get Many Benefits Including Weight Loss! W-TeluguStop.com

అయితే శరీర బరువును తగ్గించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే సలాడ్ ఒకటి.

ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకుంటే చాలు వెయిట్ లాస్ తో సహా ఎన్నో అమోఘమైన బెనిఫిట్స్ తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సలాడ్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కప్పు పెసలు నానబెట్టుకుని స్ప్రౌట్స్ తయారు చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు స్ప్రౌట్స్ వేసుకోవాలి.

అలాగే అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు తొక్క తొలగించిన కీర ముక్కలు, అర కప్పు క్యారెట్ ముక్కలు, అర క‌ప్పు టమాటో ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు వేసుకోవాలి.

Telugu Tips, Healthy Salad, Latest, Salad-Telugu Health Tips

అలాగే రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగువ, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపితే మన సలాడ్ సిద్ధమవుతుంది.ఈ సలాడ్ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.

మెటబాలిజం రేటు పెరుగుతుంది.దాంతో క్యాలరీలు చాలా త్వరగా కరుగుతాయి.

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Tips, Healthy Salad, Latest, Salad-Telugu Health Tips

అలాగే ఈ సలాడ్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.మెదడు సూపర్ షార్ప్ గా పనిచేస్తుంది.

శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ లభిస్తుంది.నీరసం అలసట వంటివి తరచూ వేధించకుండా ఉంటాయి.

వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కురులు ఒత్తుగా పొడుగ్గా సైతం పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube