కడప జిల్లాలో టిప్పర్ బీభత్సం సృష్టించింది.పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.అనంతరం పొలాల్లోకి దూసుకెళ్లగా .టిప్పర్ డ్రైవర్ మృతిచెందాడు.జమ్మలమడుగు మండలం ధర్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.







