నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వానికి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలన అవినీతి,అక్రమాల, దోపిడి,అరాచకాల మయంగా మారి ప్రజా సంపాదన కొల్లగొడుతూ నియంత పాలన చేశారన్నారు.నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి,కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఏడాది గడిచిన సందర్భంగా అమరుల ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ది చేయాలని ఆకాంక్షించారు.
ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్తారన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సహకరించాలని కోరారు