గుర్రంపోడ్ మండలంలో కనిపించని సోషల్ ఆఫీసర్ల పాలన...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగిసిన వెంటనే పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది.

కానీ,నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలో ఇంత వరకు పంచాయతీలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

తమగ్రామాలకు ఎవరిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారో తెలియక, పంచాయతీ బోర్డు వద్ద అధికారి పేరు గానీ,ఫోన్ నంబర్ కానీ అందుబాటులో ఉంచకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డామని అంటున్నారు.స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పంచాయతీలను ఇప్పటివరకు హజరు కాకపోవడం,పాలనపై దృష్టి పెట్టకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

మరో ఆరు నెలల వరకు సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం లేకపోవడతో స్పెషల్ ఆఫీసర్లు ఇలాగే ఉంటే తమ గ్రామాల పరిస్థితి ఏమిటని?ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో ఆయా గ్రామాలకు కేటాయించిన సోషల్ ఆఫీసర్ పంచాయితీకి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని,గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేసేలా,నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.మా ఊరికి స్పెషల్ ఆఫీసర్ గా ఎవర్ని పెట్టిర్రో తెల్వదని బ్రాహ్మణగూడెం మాజీ ఉప సర్పంచ్ కట్టెబోయిన విజయ్అంటున్నారు.

మా గ్రామానికి సోషల్ ఆఫీసర్ గా ఎవరో ఎసెల్బీసి అధికారిని పెడతారని చెప్పిర్రు.కానీ,ఇంకా పెట్టిర్రా లేదా తెల్వదని,గ్రామ పంచాయతీ బోర్డు వద్ద కూడా స్పెషల్ ఆఫీసర్ కి సంబంధించి పేరు కానీ,ఫోన్ నెంబర్ కానీ రాయలేదని,గ్రామ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెల్వక ప్రజలు ఇబ్బందులు పడుతుర్రని వాపోయారు.

Advertisement

ప్రత్యేక అధికారి పేరు,ఫోన్ నంబర్ పంచాయతీ బోర్డు వద్ద రాస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!
Advertisement

Latest Nalgonda News