నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన బీసీ కులగణన సర్వే రిపోర్టు పూర్తిగా బూటకపు సర్వే అని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పోగుల సైదులు గౌడ్ అభివర్ణించారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 60 శాతం పైగా ఉన్న బీసీల సంఖ్యను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన సర్వేలు 46 శాతానికి కుదిరించటం దుర్మార్గమైన చర్యని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అగ్రకులాల సంఖ్యను రెట్టింపు చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపడం హేయమైన చర్యని మండిపడ్డారు.తెలంగాణలో సమగ్రంగా చేయని సర్వే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సర్వే చేస్తా అంటే నమ్మడం ఎలా అని ప్రశ్నించారు.
మొత్తం బీసీల సంఖ్య గత పది సంవత్సరాల నుండి పెరగాలి కానీ,తగ్గుతుందా అని ఎద్దేవా చేశారు.
బీసీ సంఖ్యని తగ్గించి రిజర్వేషన్లు కుదించి అగ్రకులాల సంఖ్యను ఎక్కువ చూయించి రిజర్వేషన్లు బీసీలకు దూరం చేసే కుట్ర దాగుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.
అసలు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదన్నారు.తక్షణమే తిరిగి రీ సర్వే చేసి అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ లందరూ సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వేముల రామకృష్ణ,నాయకులు గుంజ ప్రసాద్,కర్నాటి సైదులు,శివ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.