నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలో బీజేపీ నల్గొండ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 8న అంబేద్కర్ విశ్వాస్ ర్యాలీ,భారీ కాగడాల ప్రదర్శన ఉంటుందని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్ ప్రకటించారు.గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు జూన్ 1 నుండి 15 వరకు సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు,ప్రజా సంక్షేమ కార్యక్రమాల వంటి వివిధ సంస్కరణలు అన్నిటిని ప్రజలకు వివరించే విధంగా ప్రతి కార్యకర్తా ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రజలతో మమేకం కావాలని కోరారు.ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో 8 వ, తేదీన పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అంబేద్కర్ విశ్వాస్ కాగడాల ప్రదర్శన చేపట్టాలని పిలుపు ఇచ్చినందున నల్గొండలో 3000 మందితో చేపట్టేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య,సత్యనారాయణలు మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామాల్లో పర్యటించి కేంద్ర పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని తద్వారా బీజేపీని ప్రజలకు చేరువ చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లలో ఏమి చేయకుండా ఎస్సీలను మోసాగించిందని విమర్శించారు.
ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహ,శేపూరి శ్రీనివాస్,మాస శ్రీనివాస్,కొమ్ము వెంకటయ్య,దర్శనం భార్గవ్,వెన్నమల్ల మహేష్,టౌన్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్,చింతపెళ్లి వెంకన్న,బోగరి అనిల్,మామిండ్ల శ్రీనివాస్,చిన్నెని జానీ,పోతేపాక శంకర్,దాసరి వెంకన్న,దాసరి నాగరాజు,దేవేందర్,పొలిమేర నర్సింహ తదితరులు పాల్గొన్నారు.