నల్లగొండ జిల్లా: ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్ లు ఇతర కార్యక్రమాల్లో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్షమించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.శనివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ను సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సందర్శించారు.
వారికి ప్రాజెక్ట్ సిఎండి రిజ్వి,జిల్లా కలెక్టర్ హరిచందన,ఎస్పీ చందన దీప్తి,స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వాగతం పలికారు.
ప్రాజెక్ట్ ను సందర్శించిన అనంతరం సిఏండి గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై దృష్టి సారించాలని,శరవేగంగా పూర్తి చేయాలని,ప్రాజెక్ట్ పనులలో అలసత్వం వహించరాదని,ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదన్నారు.ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ప్రభుత్వ నుండి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, గాలం వెంకన్నయాదవ్, స్కైలాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.