నల్లకొండ జిల్లా: మంగళవారం దేశ వ్యాప్తంగా వెల్లడైన లోక్ సభ,ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఏపీలో టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో టీజీలో తెలుగు తమ్ముళ్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు.విజన్ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం హర్షదాయకమని టీటీడీపీ నాయకులు పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధి లేక పడుతున్న ఇబ్బందులు తొలగిపోయేలా ఒక విజన్ గల నాయకుడిని ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నారని అభిప్రాయ పడ్డారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని, అదేవిధంగా తెలంగాణలో కూడా ఒక మంచి విజన్ గల నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.