పిల్ల‌ల చేత మ‌ట్టి తినే అల‌వాటును ఎలా మాన్పించాలో తెలుసా?

సాధార‌ణంగా పిల్ల‌లు మ‌ట్టిని తిన‌డం త‌రచూ చూస్తేనే ఉంటాము.ఎన్ని సార్లు మంద‌లించినా ఆ అల‌వాటును పిల్ల‌లు వ‌దులుకోరు.

 Do You Know How To Stop The Habit Of Eating Clay By Children , Eating Clay, Clay-TeluguStop.com

ఒక‌ప్పుడు పిల్ల‌లు మ‌ట్టి తిన్నా పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు.ఎందుకంటే, అప్ప‌ట్లో మ‌ట్టి ఎంతో స్వ‌చ్ఛంగా ఉండేది.

దానిని తిన‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కావు.కానీ, ప్ర‌స్తుతం ఉన్న మ‌ట్టి కలుషితమైనది.

ఈ మ‌ట్టిని తింటే అనారోగ్యం బారిన ప‌డే అవకాశాలే ఎక్కువ‌గా ఉంటాయి.

అందుకే పిల్ల‌లు మ‌ట్టి తింటున్నారంటే త‌ల్లిదండ్రుల్లో అల‌జ‌డి మొద‌ల‌వుతుంది.

ఈ క్ర‌మంలోనే వారి చేత ఆ అల‌వాటును మాన్పించ‌డం కోసం హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిప్పుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిన్న చిన్న చిట్కాల‌ను ట్రై చేస్తే చాలా సుల‌భంగా పిల్ల‌ల చేత మ‌ట్టి తినే అల‌వాటును మాన్పించ‌వ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

పిల్ల‌లకు రెగ్యుల‌ర్‌గా కాల్షియం ఫుడ్‌ను అందించాలి.

పిల్ల‌ల శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే కాల్షియంను అందిస్తే.వారిలో మ‌ట్టి తినాల‌న్న కోరిక చ‌చ్చిపోతుంది.

కాల్షియం కోసం పాలు, పెరుగు, ఆకుకూర‌లు, గుడ్డు, బాదం, ఛీజ్ వంటి వాటిని ఎంపిక చేసుకోవ‌చ్చు.

Telugu Clay, Tips, Simple Tips-Telugu Health Tips

మ‌ట్టి తింటున్న పిల్ల‌ల చేత ల‌వంగం నీటిని తాగించాలి.మూడు లేదా నాలుగు ల‌వంగాల‌ను వాట‌ర్‌లో వేసి మ‌రిగించి.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత ఆ నీటిని పిల్ల‌ల‌కు ప‌ట్టించాలి.

ఇలా చేస్తే పిల్ల‌లు మ‌ట్టి తిన‌డం ఆపేస్తారు.ల‌వంగం నీటి బ‌దులు వాము నీటిని తాగించినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక మ‌ట్టి తినే అల‌వాటు ఉన్న పిల్ల‌ల డైట్‌లో అర‌టి పండును చేర్చాలి.రోజుకు ఒక అర‌టి పండును వారి చేత తినిపించాలి.

ఇలా చేస్తే అర‌టి పండులో ఉండే ప‌లు ప్ర‌త్యేక సుగుణాలు పిల్ల‌ల్లో మ‌ట్టి తినాల‌న్న కోరికను అణిచివేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube