జాడలేని కంబాలపల్లి, పొగిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు: రామావత్ రమేష్ నాయక్

నల్లగొండ జిల్లా: పల్లె పల్లెకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ఎస్పీ కార్యక్రమంలో భాగంగా చందంపేట మండలంలోని నేరుట్లతండ, పోగిళ్ళ, కంబాలపల్లి గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన చందంపేట మండలంలోని కంబాలపల్లి పోగిళ్ళ ఈ ప్రాంతాలకు సాగునీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతామని స్థానిక ఎమ్మెల్యే రవీందర్ కుమార్ ప్రజలకు నమ్మబలికి ఓట్లు వేయించుకొని ముఖం చాటేసిన పరిస్థితి ఇవ్వాల కనపడుతుందన్నారు.

 Ramawat Ramesh Naik About Kambalapally Pogilla Lift Irrigation Projects, Ramawat-TeluguStop.com

ఖచ్చితంగా మేము ఈ ప్రాజెక్టులను కడతామని కేసీఆర్ చెప్పినా నేటి వరకు ఒక ఇటుకను కూడా పేర్చలేదని విమర్శించారు.

మీరు దేవరకొండ ప్రాంతం మీద చూపిస్తున్న కపట ప్రేమను దేవరకొండ ప్రజలు గమనిస్తున్నారని,రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు,కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెడతారని,ఆ దగ్గరలో ఉన్నాయని రాబోయే బహుజన రాజ్యంలో ఖచ్చితంగా మేము ఈ కంబాలపల్లి, పోగిళ్ల,పెద్ద మునిగెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కచ్చితంగా కట్టి అందరికి సాగునీరు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మంగు నాయక్,కచ నాయక్,అంజి,వెంకట్, కొండల్,అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube