రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత నాలుగు రోజుల కింద బీజేపీ పార్టీ నుండి కొంతమంది యువకులు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది అందరికీ తెలిసిన విషయమే.మరి ఆ పార్టీ లో ఉండలేక కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి పోయిన బాధతో అదే పార్టీ పరాయి పార్టీ కండువా కప్పుకోలేక పరాయి పార్టీలో ఉండలేక దేశం కోసం, ధర్మం కోసం, నా దేశానికి నా ధర్మానికి మోసం చేయలేక, బాధ దుఃఖంతో, ఆవేదనతో మళ్లీ నా కన్నతల్లి లాంటి భరతమాత దగ్గరికి వచ్చి ఒడిలోకి చేరామని యువమోర్చా నాయకులు అన్నారు.
దేశం కోసం,ధర్మం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జండా దించకుండా పనిచేయడానికి జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ సమక్షంలో బిజెపి లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో శీలం రాజు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా అధికార ప్రతినిధులు నవీన్ యాదవ్, ఠాగూర్ రాజు సింగ్ నేతృత్వంలో పార్టీలో మళ్లీ చేరారు.
బిజెపి పార్టీలో చేరిన వారిలో భూత్ అధ్యక్షులు, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ హరీష్ నేత, యల్లే నరేష్ , నల్లగొండ సాయిచందు , నక్క సాయి కుమార్ లు ఉన్నారు.







