గుండెపోటు వచ్చే 30 నిమిషముల ముందు.. శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో తెలుసా..

30 Minutes Before A Heart Attack Do You Know What Changes Are Seen In The Body , Health , Health Tips, Blood Pressure, Diabetes , Heart Problem, Cold, Fever, Cough

ఈ మధ్యకాలంలో సాధారణంగా చాలా చిన్న వయసు ఉన్న వారిలో కూడా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి.ఆశ్చర్యం ఏమిటంటే 30 సంవత్సరాల వారిని కూడా రక్తపోటు,చెక్కర వ్యాధి లాంటి ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.

 30 Minutes Before A Heart Attack Do You Know What Changes Are Seen In The Body-TeluguStop.com

ఈ రెండు సమస్యలు కాకుండా గుండెపోటు సమస్య కూడా చిన్న వయసు వారిలో విపరీతంగా పెరిగిపోయింది.దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శరీరక శ్రమ తగ్గిపోవడం, వ్యాయామం చేయకపోవడమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే కొంతమంది యువత మితిమీరిన కసరత్తు చేయడం కూడా గుండె పొటుకు ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.అయితే గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి.

ఈ విషయాలపై ఎప్పుడైనా ఆలోచించారా.ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా మారిపోతుంది.ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను కలవడం ఎంతో మంచిది.

మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి అవుతారు.ఏదైనా విషయం చెప్పాలని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటి సూచనలను గుండెపోటుకు సంకేతంగా భావిస్తారు.రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంట ఉంటుంది.ఈ లక్షణం కనిపిస్తే కూడా వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఎంతో మంచిది.

తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్న అవి ఎంతకీ తగ్గకపోయినా గుండెపోటు సంకేతంగా అనుమానించాల్సి వస్తుంది.ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలు కావచ్చు.

గుండె భారంగా అసౌకర్యంగా అనిపించినా కూడా వైద్యుని సంప్రదించాలి.

Telugu Pressure, Cough, Diabetes, Tips, Heart Problem-Telugu Health

మత్తు లేదా మగతగా ఉన్న చెమటలు ఎక్కువగా పడుతున్న గుండె నొప్పికి సూచన అని తెలుసుకోవాలి.తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వస్తున్న కూడా అస్సలు అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు.వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీస్తాయి.

ఇంకా చెప్పాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు ఒక మనిషి తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube