అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువగా తుపాకులను వారి దగ్గర పెట్టుకొని తిరుగుతూ ఉంటారు.తాజాగా అమెరికాలోని ఒక పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడు టీచర్ పై తుపాకితో కాల్పులు జరిపాడు.
తీవ్రంగా గాయపడిన టీచర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉంది.సాధారణంగా మన దేశంలో అయితే పిల్లలు స్కూల్లకు బుక్స్, లంచ్ బాక్సులు తీసుకువెళ్తుంటారు.
అదే అమెరికాలో అయితే స్కూల్ బ్యాగులతో పాటు గన్స్ కూడా తీసుకు వెళ్తూ ఉంటారు.అలా పట్టుకెళ్ళిన గన్ తో సరదాగా కాల్పులు జరపడం ఎవరో ఒకరు ఆ గన్ తూటాలకు బలి కావడం జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి సంఘటనే అమెరికాలోని ఒక స్కూల్లో జరిగింది.
అది కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఆరేళ్ల పిల్లాడు స్కూల్ కు గన్ తీసుకొచ్చాడు.
దాన్ని టీచర్కు గురిపెట్టి కాల్చాడు.అంతే ఈ గన్ ఫైరింగ్ లో టీచర్ తీవ్రంగా గాయపడింది.
తీవ్రంగా గాయపరచడిన టీచర్ కండిషన్ సీరియస్ గా ఉందని అమెరికా మీడియా వెల్లడించింది.వర్జినియా లోని రిచ్నెక్ ఎలిమెంటరీ స్కూల్లో శుక్రవారం ఆరేళ్ల విద్యార్థి గన్తో కాల్పులు జరపడంతో ఒక టీచర్ తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటనలో క్లాసులో ఉన్న మిగిలిన విద్యార్థులు ఎవరికి ఏమి కాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.ఆరేళ్ల బాబు తుపాకీతో కాల్చిన ఘటన తనను షాక్ కు గురి చేసిందని స్కూల్ సూపరిండెంట్ జార్జ్ పార్కర్ వెల్లడించారు.

వర్జినియా రాష్ట్రంలోని రిచ్ నెక్ ఎలిమెంటరీ స్కూల్లో శుక్రవారం కాల్పులు జరిపిన కురాడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ఆ కుర్రాడి చేతికి గన్ ఎలా వచ్చిందని కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.టీనేజ్ పిల్లలకు తుపాకులు అందుబాటులో లేకుండా చూడాలని తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అయితే 2022లో అమెరికాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనాల్లో 44 వేల మంది చనిపోయారని ఒక అధ్యయనంలో తెలిసింది.వీటిలో దాదాపు సగం హత్యలు, ప్రమాదాలు, ఆత్మ రక్షణ కోసం జరిగినవి కాగా మరో సగం ఆత్మహత్యలని పోలీసులు చెబుతున్నారు.







