విశాఖలో అక్రమ బంగారం భారీగా పట్టుబడింది.అక్రమంగా తరలిస్తుండగా సుమారు 1.8 కిలోల బంగారంను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన గోల్డ్ విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.కోల్ కత్తా నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.
అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.







