డబుల్ బెడ్ రూం ఇళ్ళ కోసం రోడ్డెక్కిన గిరిజన బాధితులు...!

దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హత ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం ఏమిటని జనసేన సీనియర్ నాయకులు చందు నాయక్ ప్రశ్నించారు.సోమవారం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది బాధితులు దేవరకొండ పట్టణంలో రోడ్డెక్కి ఆందోళన నిర్వహించగా,వారికి జనసేన పార్టీ మద్దతు తెలిపింది.

 Tribal People Fighting For Double Bed Room Houses In Nalgonda, Nalgonda,double B-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో పారదర్శకత పాటించకుండా అర్హత ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.నాలుగు సంవత్సరాల నుంచి లేని ఆరాటం నాలుగు రోజుల్లోనే అర్హత ఉన్న వారికి పక్కన పెట్టి కొత్త వారిని నియామకం చేయడమేంటని ప్రశ్నించారు.

గిరిజనులు ఎక్కువగా నివసించే దేవరకొండ ప్రాంతంలో గిరిజన లంబాడీలు 25 మంది లబ్ధిదారు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
డబుల్ బెడ్రూమ్ విషయంలో రిజర్వేషన్ పరంగా అన్ని కులాలకు సమ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

రోడ్డెక్కిన బాధితులతో స్థానిక తహశీల్దార్ మాట్లడుతూ రెండు రోజులు టైం ఇవ్వండి,మీకు న్యాయం చేస్తామని అంటున్నారని, అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో అవకతవకలు జరిగినందుకే అయన ఆ మాట అన్నట్లుగా స్పష్టంగా అర్ధమవుతుందన్నారు.అర్హత ఉన్నా కూడా ఇళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఈ విషయంపై స్పందించి అర్హత ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

అసలైన పేదవారు అర్హత చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube