నల్గొండ జిల్లా:దామరచర్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో భోజన అనంతరం విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వాంతులు,విరేచనాలతో తీవ్రంగా బాధపడుతున్న 25 మంది విద్యార్థినులను చికిత్స కోసం హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
కానీ,అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో చికిత్సలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.