నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో బడుగుల ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థిగా ఈడా శేషగిరిరావు గౌడ్ తో అక్టోబర్ 9 న చండూర్ లో నామినేషన్ వేయిస్తున్నామని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు,ఎన్నికల ఇంఛార్జి నూనె వెంకట్ స్వామి అన్నారు.గురువారం చండూరులోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బడుగులకు టికెట్ ఇవ్వనందున అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు చెందిన 10 పార్టీలు,20 ప్రజా సంఘాలు కలసి బడుగుల ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థిగా ఈడా శేషగిరిరావు గౌడ్ ను ఎన్నికల బరిలో నిలబెట్టినట్లు తెలిపారు.
అక్టోబర్ 9 న చండూర్ లో నామినేషన్ కార్యక్రమం ఉంటుందని,సామాజిక శక్తులన్నీ ఈడా శేషగిరిరావు గౌడ్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించాలని పిలుపునిచ్చారు.రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అభ్యర్థి ఈడా శేషగిరిరావు గౌడ్,ఎన్నికల ఏజెంట్ సకినాల హరినాధ్ పటేల్,మండలాల ఇంఛార్జీలు ముప్పిడి మారయ్య,కర్నాటి యాదగిరి నేత, మారగోని శ్రీనివాస్ గౌడ్,మండలి లింగయ్య యాదవ్, చొప్పరి రాజుయాదవ్ పాల్గొన్నారు.