పురుషులలో శృంగార సామర్థ్యాన్ని పెంచే దినుసులు ఇవన్ని

మెంతులతో ఏం చేస్తారు అంటే పచ్చల్లలో వేసుకుంటారు అంటారు.జీలకర్రతో ఏం చేస్తారు అంటే జీర రైస్ చేస్తారు అంటారు.

మరి లవంగంతో ? ఏముంది వీటిలాగే వంటల్లో వాడతాం, యాలకులని బగారాలో వాడతాం, ఉల్లిపాయలు పప్పులో వేస్తాం, సఫ్రాన్ ని స్వీటులో వాడతాం.ఇంతేనా ? మన వంటింట్లో ఉండే మసాలా దినుసులకి కేవలం వంటింటి అవసరాలకే, వంట చేయడానికే పనికివస్తాయా ? లేదు .వీటి లాభాల లిస్టు చాలా పెద్దది.రోజంతా కూర్చున్నా మనం టాపిక్ ఫినిష్ చేయలేం.

 Indian Spices That Increase Libido In Men-Indian Spices That Increase Libido In Men-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ దినుసుల్లో అందించే ఎన్నో లాభాల్లో శృంగార వాంఛ కూడా ఒకటి.అవును ఈ దినుసులు పురుషులలో లిబిడోని పెంచుతాయి.

* ఉల్లిపాయలో ఎల్లోసిన్ అనే పదార్ధం ఉండటం వలన ఇది పురుషాంగానికి రక్తప్రసరణ బాగా పెంచుతుంది.తద్వారా అంగస్తంభన సమస్యలు దూరం అవుతాయి.

* లవంగాలు ఒంట్లో కావాల్సినంత వేడిని ఇస్తాయి.ఇది టెస్టోస్టెరాన్ లెవల్స్ ని పెంచి శృంగారంలో చురుగ్గా ఉండేలా చేస్తుంది.

* మెంతుల్లో సపోనిన్స్ ఉంటాయి.ఇవి కూడా టెస్టోస్టెరాన్ లెవల్స్ ని పెంచి, కామదాహాన్ని పెంచుతాయి.

* కుంకుమపువ్వు పాలలో వేసుకొని తాగి, శృంగారం చేస్తే పిల్లలు ఎర్రగా పుడతారని నమ్ముతారు.అది పూర్తిగా నిజం కాదు కాని కుంకుమపువ్వు సెక్స్ లో కావాల్సిన లిబిడోని ఎనర్జీని మాత్రం ఇస్తుంది.

* జీలకర్ర లిబిడోని పెంచడమే కాదు, శీఘ్రస్కలనం వంటి సమస్యను తగ్గిస్తుంది.దీన్ని ఫేనుగ్రీక్ సీడ్స్ తో కలిపి తీసుకోవాలి.

* యాలకులలో ఉండే స్నినియోల్ స్టామినాని పెంచుతుంది.ఇది శృంగారంలో బలాన్ని కూడా ఇస్తుంది.

* అశ్వగంధ, బాజికాయ కూడా శృంగార కోరికలను, శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి.వీటిని వేల ఏళ్ళుగా వాడుతున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు